ప్రధాన వార్తలు @ 5PM

.
- ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై అధికారులతో చర్చించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎస్‍ఈసీ పిటిషన్‍పై విచారణ.. హాజరుకావాలని నీలం సాహ్ని, ద్వివేదికి హైకోర్టు ఆదేశం
ఎస్‍ఈసీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కోర్టు ఎదుట హాజరుకావాలని మాజీ సీఎస్ నీలం సాహ్నితో పాటు పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ద్వివేదికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సదరన్ జోనల్ కౌన్సిల్‌కు ఏపీ సభ్యుడిగా ఆయనను నామినేట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు!
ఈశాన్య, తూర్పు గాలులు ప్రభావం వల్ల...రాష్ట్రంలో నేడు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లోక్‌సభ ఎంపీ మోహన్ ఆత్మహత్య!
దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్(58) అనుమానాస్పద స్థితిలో మరణించారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్‌లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మోహన్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండు వారాల్లోనే కరోనా కేసులు 36% వృద్ధి!
మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 8 నుంచి మహమ్మారి బారిన పడిన వారి శాతం అమాంతంగా పెరిగినట్లు ముంబయి నగర పాలక సంస్థ (బీఎంసీ) తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాక్‌పై భిన్నాభిప్రాయాలు- 'గ్రే' లిస్ట్‌లోనే కొనసాగింపు!
ఉగ్ర కార్యకలాపాల విషయంలో పాకిస్థాన్.. జూన్ వరకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ 'గ్రే' జాబితాలోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశం గురించి అధికారులు, రాయబారులు చర్చించగా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు పాక్ పత్రిక వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నివేదిక'
15వ ఆర్థిక సంఘం నివేదికను రూపొందించే సమయంలో ఎదురైన సవాళ్లను ఇటీవీ భారత్‌కు ప్రత్యేకంగా వివరించారు ఛైర్మన్ ఎన్కే సింగ్. కరోనా సంక్షోభం అనంతరం నివేదికకు మార్పులు చేసినట్లు చెప్పారు. నివేదికలో పేర్కొన్న ద్రవ్యలోటుకు, బడ్జెట్ సందర్భంగా కేంద్రం అంచనా వేసిన ద్రవ్యలోటుకు వ్యత్యాసం ఎందుకుందో తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ మనదే!'
ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. ఇతర జట్లతో పోలిస్తే టీమ్ఇండియా గొప్పగా ఆడుతోందని ప్రశంసించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 20 ఏళ్ల తర్వాత 'చిత్రం'కు సీక్వెల్.. తేజ ప్రకటన
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'చిత్రం'కు సీక్వెల్ ప్రకటించారు దర్శకుడు తేజ. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.