
....
- 'అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది'
అమరావతి అభివృద్ధి కోసం వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్ని నాని ఉద్ఘాటించారు. అమరావతి భూముల విలువ పెంచేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు... తీర్పును రిజర్వు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై జనసేన పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో జనసేన పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. విచారణ జరిపిన కోర్టు... బుధవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మద్యం మత్తులో ఘర్షణ... బాణాలతో దాడి... ఒకరు మృతి
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తుమ్మలబైలులో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఘర్షణకు దిగిన చెంచు యువకులు బాణాలతో దాడి చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఒకే హాస్టల్లో 40 మందికి కరోనా
మహారాష్ట్ర లాతూర్ నగరం ఎమ్ఐడీసీ ప్రాంతంలోని ఓ హస్టల్లో దాదాపు 40 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. హాస్టల్లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా వారికీ పరీక్షలు చేయించారు హాస్టల్ నిర్వాహకులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ రాష్ట్రంలో వెయ్యి చెరువులు మాయం!
తమిళనాడులో నీటి కుంటలు, చెరువులు, సరస్సులు రానురాను మాయమవుతున్నాయని ప్రజా పనులు విభాగం మాజీ అధికారులు విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. అధికారుల ఉదాసీనత, ప్రజలు నిర్లక్ష్యం కారణంగా 50ఏళ్లలో సుమారు వెయ్యికి పైగా జల వనరులు కబ్జాకు గురైనట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 14 ఏళ్ల బాలికతో ఎంపీ పెళ్లి- దర్యాప్తు షురూ
పాకిస్థాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ 14 ఏళ్ల మైనర్‌ను వివాహం చేసుకున్నారని చిత్రాల్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ ఏడాది సగటున 7.7% వేతనాల పెంపు!
కరోనా నుంచి వ్యాపారాలు క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో 2021లో భారత్‌లో ఉద్యోగులకు సగటున 7.7 శాతం చొప్పున వేతనాలు పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలిసింది. సర్వేలో వెల్లడైన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పింక్' జట్టుపై ఎటూ తేల్చని ఇంగ్లాండ్!
మొతేరా వేదికగా జరగనున్న పింక్ టెస్టులో తమ తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై ఇంకా స్పష్టత లేదని ఇంగ్లాండ్ సారథి రూట్ పేర్కొన్నాడు. పిచ్‌తో పాటు పింక్ బాల్ ఎలా స్పందిస్తుందో అవగాహన లేదని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇరువురు భామలు.. ఇరుకున హీరోలు!
హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ కిక్కే వేరు. వారిద్దరితో కథానాయకుడు చేసే రొమాన్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. హీరో ఏ నాయికని ప్రేమిస్తాడు? ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? అనే ఉత్కంఠ కూడా ఉంటుంది. ఇలా టాలీవుడ్లో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు చాలానే వచ్చాయి. ఈ ఏడాదిలోనూ కొన్ని సినిమాలు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.