
బడుగు వర్గాల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాలూరు గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి శెట్టి తిరుపతిపై దాడి చేయడం దారుణమన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి ఓటు వేయలేదనే నెపంతో కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాలూరు గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శెట్టి తిరుపతి, అతని కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేయడం దుర్మార్గమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బడుగు బలహీనవర్గాల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు.
రాజ్యాంగబద్దంగా వారికి వచ్చిన హక్కులను నీరుగారుస్తున్న వైకాపా నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. తెదేపా అభ్యర్థులు గెలిచిన చోట వైకాపా శ్రేణులు దాడులు, విధ్వంసాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటే డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి
మార్చి 10వ తేదీన సెలవు ప్రకటించండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశం