మహబూబ్‌నగర్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్

రాష్ట్ర అబ్కారీ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి దశదిన కర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. నేడు మహబూబ్‌నగర్‌లో జరగబోయే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
సీఎం కేసీఆర్ నేడు మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి దశదిన కర్మలకు ఆయన హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు.. హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి... హెలికాప్టర్లో బయల్దేరతారు. పదిన్నరకు మహబుబ్‌నగర్‌కు చేరుకుంటారు. మంత్రి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం తిరిగి ప్రగతిభవన్‌కు పయనమవుతారు.
ఇదీ చదవండి: ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వమే తీసుకుంటుంది.. అంగీకరించకపోతే?