
నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు జరిగే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు సమానమైన సంఖ్యాబలం వచ్చినప్పుడు.. ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కీలకం అవుతారు. నోటిఫికేషన్ వెలువడిన నెల రోజులలోపు వారు ఎక్కడి నుంచి ఆ ఓటు హక్కు వినియోగించుకుంటారో ప్రజాప్రతినిధులు ఎన్నికల అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీల నుంచి ఎక్స్ అఫీషియో ఓటు హక్కు ఎక్కడ నమోదు చేసుకుంటారనే వివరాలను తీసుకొని వారం రోజుల్లోగా తమకు పంపాలని పురపాలకశాఖ ఎన్నికల విభాగం అధికారులు పట్టణాల కమిషనర్లను కోరారు.
రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు జరిగే ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు సమానమైన సంఖ్యాబలం వచ్చినప్పుడు ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కీలకం అవుతారు. ఎమ్మెల్యే, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఎక్స్ అఫీషియో ఓటు ఉంటుంది. వారు ఛైర్మన్ ఎన్నికల్లో పాల్గొనవచ్చు. తమ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక నగరం, పట్టణంలో ఎక్స్‌అఫీషియో ఓటును వారు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
పుర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నెల రోజులలోపు వారు ఎక్కడి నుంచి ఆ ఓటు హక్కు వినియోగించుకుంటారో ప్రజాప్రతినిధులు ఎన్నికల అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీల నుంచి ఎక్స్ అఫీషియో ఓటు హక్కు ఎక్కడ నమోదు చేసుకుంటారనే వివరాలను తీసుకొని వారం రోజుల్లోగా తమకు పంపాలని పురపాలకశాఖ ఎన్నికల విభాగం అధికారులు పట్టణాల కమిషనర్లను కోరారు. ఈ మేరకు కమిషనర్లు వివరాల సేకరణకు ఉద్యుక్తులవుతున్నారు.
ఇదీ చదవండి:
వైకాపాతో కొందరు పోలీసులు, అధికారులు కుమ్మక్కు.. ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ