రాష్ట్రంలో కొత్తగా 70 కరోనా కేసులు... ఒకరు మృతి
ap

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 70 మందికి కరోనా సోకింది. 84 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. విశాఖపట్నంలో ఒకరు మరణించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 8,89,409 మంది కొవిడ్ బారిన పడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ap corona cases on 23rd february
new corona cases in state on 23rd february

రాష్ట్రంలో గత 24 గంటల్లో 28,268 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 70 మందికి పాజిటివ్ వచ్చింది. 84 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. విశాఖపట్నంలో ఒకరు మరణించారు. చిత్తూరులో అత్యధికంగా 18 కేసులు నమోదు కాగా.. కర్నూలులో ఒక్కరికీ మహమ్మారి సోకలేదు. తూర్పుగోదావరి విశాఖపట్నంలో 9, కృష్ణాలో 7, నెల్లూరులో 6, గుంటూరులో 5, పశ్చిమగోదావరి శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 3, అనంతపురం ప్రకాశంలో 2, కడపలో ఒకరు చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 1,37,75,253 రోగుల నమూనాలు పరిశీలించగా.. 8,89,409 మందికి వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 8,81,666 మంది కొవిడ్ బారినుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. మరో 575 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 7,168 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

అగ్రవర్ణ పేదలకు గుడ్​ న్యూస్... 'ఈబీసీ నేస్తం'కు కేబినెట్‌ ఆమోదం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.