
.
- ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను అధికారులు చాలా వరకూ తారుమారు చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. మూడంకెల మెజారిటీ ఉన్నచోట్ల కూడా.. వైకాపా ఒత్తిళ్లతో రీకౌంటింగ్ పేరిట ఫలితాలు మార్చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఎస్ఈసీకీ లేఖ రాశారు. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి
- 'జగన్ చిత్త శుద్ధితోనే చరిత్రాత్మక విజయం'
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని వైకాపా నేతలు వ్యాఖ్యానించారు. మూడు దఫాల కంటే నాలుగో విడత ఎన్నికల్లోనే ఫలితాలు మెరుగ్గా వచ్చాయని పార్టీ నేతలు తెలిపారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచామని.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- జూన్‌లోగా శాసనమండలిపై పట్టు.. అధికార పార్టీ కసరత్తు
జూన్ నాటికి శాసనమండలిపై పట్టు సాధించేందుకు వైకాపా సన్నద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ విభాగాల కింద ఎన్నికైన, నియమితులైన ఎమ్మెల్సీల్లో 23 మంది పదవీకాలం జూన్ నాటికి ముగియనుంది. ఈ 23 మందిలో వైకాపాకు చెందిన ఎమ్మెల్సీలు నలుగురున్నారు. ఈ నాలుగింటితో పాటు మిగిలిన 19 స్థానాలనూ కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- స్వల్ప ఆధిక్యంతో విజయాలు.. రాష్ట్ర వ్యాప్తంగా వివాదాలు
రాష్టంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అధికారుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిపి వెలువడించిన ఫలితాలు... అనేక చోట్ల వివాదాలకు కారణమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో.. అభ్యర్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని... అధికారులు కొందరికి కొమ్ముకాస్తున్నారని గొడవకు దిగిన ఘటనలు నమోదయ్యాయి. పోలీసులు కేెంద్రాల వద్దకు చేరుకుని వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నేడు అసోం, బంగాల్లో మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అసోం, బంగాల్లో పర్యటించనున్నారు. అసోంలో చమురు, గ్యాస్ ప్రాజెక్టులను జాతికి అంతికమివ్వనున్నారు. సాయంత్రం బంగాల్లో నోపార నుంచి దక్షిణేశ్వర్ వరకు విస్తరించిన మెట్రో ప్రాజెక్టును ప్రారంభిస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'అలా ఆందోళన చేసినా చట్టాలు రద్దు కావు'
రైతులకు వ్యతిరేకంగా సాగు చట్టాల్లో ఏముందో చెప్పాలని కర్షక సంఘాలను కోరారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రైతుల సమస్యలను అర్థం చేసుకుని, చట్టాల సవరణకు సర్కారు ఇప్పటికీ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఆ కరోనా రకాలపై టీకాలూ పనిచేయవ్!'
రెండు నిర్దిష్ట ఉత్పరివర్తనాలు కలిగిన కరోనా రకాలపై టీకాలు కూడా పనిచేయకపోయే అవకాశం ఉందని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ వెల్లడించారు. దేశంలో మొదలయ్యే కొత్త రకాల వైరస్‌లపై కేంద్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- '2022లోనూ అమెరికన్లకు మాస్కులు తప్పవు'
వచ్చే ఏడాది కూడా అమెరికన్లు మాస్కులు ధరించక తప్పకపోవచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ అన్నారు. 2021 చివరికల్లా మహమ్మారి ముందు నాటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కోహ్లీ-అనుష్క ఇంట్లో పనోళ్లే ఉండరట!
ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ స్థానంలో ఉన్న కోహ్లీ ఓ వైపు.. నటిగా, నిర్మాతగా బాలీవుడ్ చిత్రాల్లో రాణిస్తున్న అనుష్క శర్మ మరోవైపు.. అలాంటి ఈ దంపతుల నివాసంలో పనోళ్లే ఉండరంటే నమ్ముతారా? కానీ అది నిజమని చెబుతున్నాడు మాజీ ఆటగాడు శరణ్‌దీప్ సింగ్. ఇంటికి వచ్చిన అతిథులకు స్వయంగా వారిద్దరే వడ్డిస్తారని ఆయన తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బిగ్‌బాస్-14 విజేతగా రుబినా దిలైక్
హిందీ బిగ్‌బాస్ సీజన్-14 ముగిసింది. ఆదివారం ఉత్కంఠంగా సాగిన ఈ షో ఫినాలేలో బుల్లితెర నటి రుబినా దిలైక్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని అందుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి