ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM
- రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంకితభావంతో పనిచేసిందని ప్రశంసించారు. ఎంతో విజ్ఞత, సంయమనంతో వ్యవహరించడం వల్లే సాధ్యమైందని అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ
క్షణక్షణం ఉత్కంఠ. ఫలితం తేలేవరకూ ఉద్విగ్నభరితం. దోబూచులాడిన అదృష్టం. ఒకే ఒక్క ఓటుతో ఐదేళ్ల నాయకత్వ అవకాశం దక్కించుకున్న సంబరమొకరిది. ఓట్లు సమానంగా వచ్చి బొమ్మాబొరుసులో దురదృష్టం వెక్కిరించిన వారు మరొకరు. పదిలోపు ఓట్ల తేడాతోనే సర్పంచ్‌లుగా ఎన్నికై ఊపిరి పీల్చుకున్న వారు ఎందరో. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దాచేపల్లిలో రైతు ఆత్మహత్య..
గుంటూరు జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్టినాడు సిమెంట్ కర్మాగారం దూళి వల్ల పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ.. సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. యాజమాన్యం దృష్టికి ఎన్నిసార్లు విషయం తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేని కారణంగా నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పుదుచ్చేరి అసెంబ్లీలో బలపరీక్ష- గెలుపుపై సీఎం ధీమా
పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో కాంగ్రెస్ సర్కారు భవితవ్యాన్ని తేల్చే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. సభలో బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ఆదేశాలతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నా నేతృత్వంలో మూడో కూటమి
తమిళనాడులో శాసనసభ ఎన్నికలకు ముందు మూడో కూటమి అంశం తెరమీదకు వచ్చింది. మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) నేతృత్వంలో త్వరలోనే ఓ కూటమి ఏర్పడే అవకాశమున్నట్టు ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ తెలిపారు. ఎంఎన్ఎం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మోదీ చెప్పిన మంచి రోజు ఇదేనా?'
భాజపాపై శివసేన ధ్వజమెత్తింది. సామ్న పత్రిక సంపాదకీయంలో కేంద్రం వైఖరిపై తీవ్ర విమర్శలు చేసింది. పెట్రోల్ ధరల పెంపుపై తీవ్రస్థాయిలో మండిపడింది. 'ఇదేనా మోదీ చెప్పిన మంచి రోజు?' అని ప్రశ్నించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అణు కార్యకలాపాలపై ఇరాన్ సహకారం తక్కువే'
తమ దేశంలోని అణు కార్యక్రమాలపై ఐరాస పర్యవేక్షణను కుదించేలా ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అణు కార్యక్రమాలపై ఇరాన్ తక్కువ సమాచారాన్నే అందుబాటులో ఉంచుతుందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 230 పాయింట్లు కోల్పోయి 50,661 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా నష్టంతో 14,928 వద్ద కొనసాగుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రోహిత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తా: మైఖేల్ వాన్
చెన్నై పిచ్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో టీమ్‌ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇవ్వడంపై ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించాడు. రోహిత్ మాటలతో తాను పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పాడు. ఇదే విషయాన్ని ట్వీట్టర్లో వెల్లడించాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇకపై స్పెషల్ సాంగ్స్‌కు దూరంగా అనసూయ!
నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పారు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్. ఇకపై ప్రత్యేక గీతాల్లో నటించనని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.