ప్రధాన వార్తలు @3 PM
Breaking

.

  • పురపాలక ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలి..: ఎస్​ఈసీ

జిల్లాల ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో నిమ్మగడ్డ భేటీ అయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లోనూ.. ప్రభంజనం సృష్టిస్తాం'

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం సృష్టించిందని పంచాయతీ రాజ్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇదే స్పూర్తితో రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇంతకన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపైనే వైకాపా ఆధారపడింది: చంద్రబాబు

పంచాయతీ ఎన్నికల్లో 4వ విడత 41.7 శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. నాలుగు విడతలు కలిపి 4,230 సర్పంచ్ స్థానాలు గెలిచామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ధవళేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కత్తులతో దాడి

రియల్ ఎస్టేట్​ వ్యాపారిపై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బొగ్గు చౌర్యం కేసులో గంభీర్​కు సీబీఐ ఉచ్చు!

బంగాల్​లో బొగ్గు చౌర్యం కేసులో అభిషేక్ బెనర్జీ భార్య సోదరి మేనకా గంభీర్​ను ప్రశ్నించేందుకు ఆమె ఇంటికి వెళ్లారు సీబీఐ అధికారులు. ఈ కేసుకు సంబంధించి అభిషేక్ భార్యతో పాటు, ఈమెకు ఆదివారమే నోటీసులు జారీ చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • భార్యపై పాశవికంగా దాడి చేసి.. అడవిలో వదిలేసి...

మద్యం మత్తులో భార్యతో కర్కశంగా వ్యవహరించాడు ఓ భర్త. తీవ్రంగా కొట్టి.. జననాంగాల్లో ఇనుపరాడ్డు చొప్పించాడు. తర్వాత ఆమెను అడవిలో వదిలేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తి కావాలనే ఉద్దేశం లేదు'

అమెరికా-చైనాల మధ్య సయోధ్యకు పావులు కదుపుతోంది జిన్​పింగ్​ సర్కార్​. ఈ మేరకు తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బైడెన్​ ప్రభుత్వాన్ని కోరింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఫ్యూచర్​ రిటైల్​, బియానీకి సుప్రీం నోటీసులు

ఫ్యూచర్​ రిటైల్​-అమెజాన్​ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అమెజాన్​ వాదనపై స్పందించాలని ఫ్యూచర్​ రిటైల్​, కిశోర్​ బియానీకి సోమవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఫెదరర్​ రికార్డును జకోవిచ్​ అధిగమించగలడా?

నొవాక్ జకోవిచ్​.. తన కెరీర్​లో ఇప్పటివరకు 18 గ్రాండ్​స్లామ్​ టైటిల్స్​ సొంతం చేసుకున్నాడు. గత పది గ్రాండ్​స్లామ్​ టోర్నీల్లో ఆరు విజయాలు జకోవిచ్​వే కావడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఓటీటీలో ధనుష్‌ చిత్రం- టీజర్‌ రిలీజ్

తమిళ హీరో ధనుష్​​ నటించిన 'జగమే తంత్రం' సినిమా ఓటీటీ నెట్​ఫ్లిక్స్​లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా టీజర్​ను విడుదల చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.