ప్రధాన వార్తలు @ 3PM

...
- సీఎం జగన్‌కు అమరావతి రైతులనుంచి నిరసన సెగ
మందడం వద్ద సీఎం జగన్‌కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది. ముఖ్యమంత్రి సచివాలయం వెళ్తుండగా జై అమరావతి.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. సంక్షేమాలపేరిట ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ముగిసిన మంత్రివర్గ సమావేశం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే ఉన్న నేత ఎర్రన్నాయుడు'
ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని మరోసారి గుర్తు చేసుకుందామని ట్విట్టర్ వేదికగా అభిమానులకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాడేపల్లి ప్యాలెస్‌లో బేరం కుదరబట్టే.. ఈఓ సస్పెన్షన్ ఆగింది
తాడేపల్లి ప్యాలెస్‌లో బేరం కుదరబట్టే.. దుర్గగుడి ఈఓ సురేష్ బాబు సస్పెన్షన్ వేటు ఆగిపోయిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'టీకాతోనే కరోనా నుంచి దీర్ఘకాల రక్షణ'
వ్యాక్సిన్ పంపిణీతోనే కరోనాకు వ్యతిరేకంగా దీర్ఘకాల ఇమ్యూనిటీ సాధ్యమవుతుందని నిపుణులు తెలిపారు. కరోనా సోకిన తర్వాత వచ్చే యాంటీబాడీల రక్షణ కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని చెప్పారు. కాబట్టి వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'విద్యార్థులూ.. ఈ మూడింటిపై దృష్టి పెట్టండి'
కరోనా సమయంలో ఐఐటీలు అభివృద్ధి చేసిన సాంకేతికత వైరస్‌పై పోరాడటంలో ఉపయోగపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఐఐటీ ఖరగ్‌పుర్ 66వ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బైడెన్ జట్టులో మరో భారతీయ అమెరికన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్ స్థానం సంపాదించారు. వ్యవసాయ విభాగంలో సీనియర్ సలహాదారుగా బిదీషా భట్టాచార్యను సోమవారం నియమించారు. మరోవైపు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నీరా టాండెన్ నియామకం పట్ల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వతంత్ర సంస్థగా రిలయన్స్ ఓ2సీ విభాగం
మాతృ సంస్థ నుంచి ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ) వ్యాపారాన్ని విడదీసి.. కొత్త యూనిట్‌ను పూర్తి స్వతంత్ర కంపెనీగా మార్చనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. నూతన కంపెనీపై 100 శాతం నియంత్రణ అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సిరీస్ మాదే.. పింక్-బాల్ టెస్టు కీలకం'
భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తమ జట్టు గెలుస్తుందనే నమ్మకం ఉందని ఇంగ్లాండ్ టీమ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధీమా వ్యక్తం చేశాడు. పింక్-బాల్ టెస్టు కీలకం కానుందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'లూసిఫర్' అంటే? రీమేక్‌లో ఈ మార్పులు చేస్తారా?
'లూసిఫర్' రీమేక్ యథాతథంగా తీస్తే వచ్చే సమస్యలు, లోపాలను వివరించారు ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ. లూసిఫర్ అంటే 'వేగుచుక్క', 'సైతాన్' అని అర్థం వస్తుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.