ప్రధాన వార్తలు @7PM

...
- గవర్నర్ బిశ్వభూషణ్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ సమావేశం
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఏకగ్రీవాలు, ఓటింగ్ శాతం పెరుగుదల గురించి వివరించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎస్‍ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ
ఎస్‍ఈసీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ సహకారం లేదని గతంలో ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్రామ సచివాలయాల్లో డేటా క్రోడీకరణకు కార్యాచరణ సిద్ధం చేయండి: సీఎం
ప్రణాళిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గ్రామ సచివాలయ డేటా క్రోడీకరణ బాధ్యతలను డిజిటల్ అసిస్టెంట్‌కు అప్పగించాలని ఆదేశించారు. సుస్థిర సమగ్రాభివృద్ధికి ఐరాస నిర్దేశించిన లక్ష్యాల అమలుకు తగిన సాయం తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ నెల 25, 26న కుప్పంలో చంద్రబాబు పర్యటన
ఈ నెల 25, 26న కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో వివిధ అంశాలపై సమావేశాలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'దేశానికి వ్యవసాయమే ప్రధాన వ్యాపారం'
దేశంలో భరత మాతకు చెందిన వ్యాపారం ఏదైనా ఉందంటే.. అది కేవలం వ్యవసాయ రంగం మాత్రమే అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మిగతావన్నీఒకరిద్దరు వ్యాపారులకే పరిమితమైనవని పేర్కొన్నారు. సొంత నియోజకవర్గం కేరళలోని వయనాడ్‌లో పర్యటిస్తున్న రాహుల్ రైతులకు మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టూల్ కిట్ కేసులో ఒక్కరోజు పోలీస్ కస్టడీకి దిశ
టూల్ కిట్ కేసులో అరెస్టయిన దిశ రవికి ఒక్కరోజు పోలీస్ కస్టడీ విధించింది దిల్లీ కోర్టు. ఈ కేసులో ఇతర నిందితులు నికితా జాకబ్, ఇంజినీర్ శంతనుతో కలిపి దిశ రవిని విచారించేందుకు సమయం కావాలని పోలీసులు కోరగా.. కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మయన్మార్‌లో అలజడి- ఐరాస ఉన్నత స్థాయి భేటీ
మయన్మార్‌లో నిరసనలు ఉద్ధృతమవుతున్న తరుణంలో ఐరాస మానవ హక్కుల మండలి ఉన్నత స్థాయి సమావేశం సోమవారం ప్రారంభమైంది. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ భేటీలో పాల్గొంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాంగోలో ఇటలీ రాయబారి కాల్చివేత
కాంగోలో ఇటలీ రాయబారి హత్యకు గురయ్యారు. గోమా పట్టణంలో ఐరాస వాహనంలో ప్రయాణిస్తోన్న ఆయనతో పాటు పోలీసు అధికారిని దుండగులు సోమవారం కాల్చి చంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఒలింపిక్స్ ఆటగాళ్లకు త్వరలోనే కొవిడ్ టీకా'
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆటగాళ్లకు త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా పంపిణీ జరుగుతోందని, అనంతరం అథ్లెట్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'టక్ జగదీష్' టీజర్ కౌంట్‌డౌన్.. వైజాగ్‌కు 'పాగల్'
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో టక్ జగదీష్, పాగల్, విరాటపర్వం, బచ్చన్ పాండే చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.