
కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని.. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా.. విజయవాడ పంజా సెంటర్లోని పలు డివిజన్లలో ప్రచారం వారు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో పట్టం కట్టినట్లుగానే మున్సిపల్ పోరులోనూ విజయం కట్టబెట్టాలని ఓటర్లను కోరారు.
విజయవాడ పంజా సెంటర్లోని పలు డివిజన్లలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీబొమ్మ సెంటర్, మహంతిపురంలో వైకాపా శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో పట్టం కట్టిన విధంగానే.. పురపోరులోనూ వైకాపాకు ప్రజలు అధికారం ఇస్తారని ఆశిస్తున్నట్లు అంజద్ బాషా పేర్కొన్నారు. గత ప్రభుత్వం కంటే సీఎం జగన్ పాలనలో మైనార్టీలకు అధికంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు.
ఇదీ చదవండి: