
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. గత కొంత కాలంగా వైకాపాకు దూరంగా ఉంటున్న ఆయన.. తెదేపాలో చేరుతారని ప్రచారం నడుస్తోంది.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు తెలుగుదేశం అధినేత చంద్రబాబును పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో కలిశారు. గత కొంత కాలంగా వైకాపాకు దూరంగా ఉంటూ వస్తున్న డేవిడ్ రాజు త్వరలోనే తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ఆయన సమావేశం కావటం చర్చనీయాంశమైంది. 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి గెలుపొందిన ఆయన..తెదేపాలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి వైకాపాకు గూటికి చేరుకున్నారు.
ఇదీచదవండి
అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపైనే వైకాపా ఆధారపడింది: చంద్రబాబు