
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు ఏడాది క్రితమే వైకాపా ఆధ్వర్యంలో కుట్ర మొదలైందని.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. కుట్రలో భాగంగానే వైకాపా ఎంపీలు పోస్కో ప్రతినిధులతో కలిసి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై వైకాపా నాయకులు అమాయకంగా మాట్లాడుతున్నారని... దీనివెనుక అతిపెద్ది కుట్ర దాగి ఉందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. ఏడాది క్రితమే కుట్ర మెుదలైందని.., కుట్రలో భాగంగానే వైకాపా ఎంపీలు పోస్కో ప్రతినిధులతో కలిసి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారన్నారు. విభజన హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టటం, ఆంధ్రాబ్యాంకు విలీనం అడ్డుకోవటం వంటి అంశాల్లో వైకాపా ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారన్నారు.
ఇదీచదవండి
ముగిసిన మంత్రివర్గ సమావేశం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ