'80 శాతానికి పైగా గెలిచామంటూ వైకాపా అసత్య ప్రచారం'
Breaking

సర్పంచ్ ఎన్నికల్లో 80 శాతానికి పైగా వైకాపా మద్దతుదారులు గెలిచారని ఆ పార్టీ కార్యకర్తలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెదేపా కార్య నిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు. జగన్​కు అంత ప్రజాబలం ఉందని భావిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాతీర్పు కోరాలని పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు 80 శాతానికి పైగా గెలిచారని ఆ పార్టీ కార్యకర్తలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెదేపా కార్య నిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం దుయ్యబట్టారు. జగన్​కు అంత ప్రజాబలం ఉందని భావిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాతీర్పు కోరాలన్నారు. భయపెట్టి ఓట్లు సాధించకుండా.. భరోసాతో ప్రజల మద్దతు కూడగడితే ఎవరి బలమెంతో తేలిపోతుందని స్పష్టం చేసారు. అరవై శాతానికి పైగా వైకాపా మంత్రుల సొంత గ్రామాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారని బ్రహ్మం పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఓటుకు నోటు కేసు: 'సీడీలు, హార్డ్​ డిస్కులు సమర్పించండి'

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.