
అతివేగంతో వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు.. అజాగ్రత్తగా రోడ్డు దాటుతున్న పాదచారుడు.. ఫలితంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘటనలో ఇరువురు గాయపడగా... అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
తెలంగాణ.. మేడ్చల్ జిల్లా చింతల్ బస్టాప్ వద్ద ప్రమాదం జరిగింది. చింతల్‌కు చెందిన శివసాయి గౌడ్(20) హెల్మెట్ లేకుండా అతివేగంగా బాలానగర్ వైపు వెళ్తుండగా.. మార్గ మధ్యలో శంకరయ్య అనే వ్యక్తి వాహనాలను గమనించకుండా.. డబ్బులు లెక్కపెట్టుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అతివేగంతో వచ్చిన శివసాయి.. శంకరయ్యను ఢీకొట్టాడు.
ఈ ఘటనలో శివసాయి ఒక్కసారిగా ఎగిరి రోడ్డుకు అవతలివైపు పడిపోయాడు. శంకరయ్యకు స్వల్ప గాయలవగా.. శివ సాయికి తలకు బలమైన గాయమైంది. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇదీ చూడండి: 'సీటీమార్' టీజర్.. మహేశ్ సినిమా షెడ్యూల్ పూర్తి