15 ఏళ్ల తర్వాత చిరుతో ఆ హీరోయిన్?
Trisha

అగ్రకథానాయకుడు చిరంజీవితో కలిసి మరోసారి నటించేందుకు త్రిష సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని సంగతేంటి?

మెగాస్టార్‌ చిరంజీవి నటించనున్న 'లూసిఫర్‌' రీమేక్‌ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓ స్టార్‌ హీరోయిన్‌ చిరు సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా భామ?

చిరంజీవి 'స్టాలిన్‌'లో కథానాయికగా ప్రేక్షకులను అలరించారు త్రిష. 2006లో విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకోలేదు. కొరటాల శివ 'ఆచార్య'లో తొలుత త్రిషనే హీరోయిన్​గా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు.

Trisha in megastar chiranjeevi movie
హీరోయిన్ త్రిష

'లూసిఫర్‌' రీమేక్‌లో నయనతారను కథానాయికగా అనుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నయన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారని.. దీంతో, ఆమె స్థానంలో త్రిషను ఎంపిక చేసుకున్నారని మాట్లాడుకుంటున్నారు. త్రిష కూడా 'లూసిఫర్‌' రీమేక్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇది చదవండి: 'లూసిఫర్‌' అంటే? రీమేక్‌లో ఈ మార్పులు చేస్తారా?

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.