
జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో చెన్నైకి చెందిన సత్యన్ విజేతగా నిలిచాడు. టోర్నీ ఫైనల్లో శరత్ కమల్‌పై నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
భారత టీటీ స్టార్ సత్యన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అతడు తొలిసారి జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ సొంతం చేసుకున్నాడు. మంగళవారం ఫైనల్లో సత్యన్ 4-2 (11-6, 11-7, 10-12, 7-11, 11-8, 11-8)తో తొమ్మిదిసార్లు ఛాంపియన్ శరత్ కమల్‌పై నెగ్గి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు సెమీఫైనల్లో సత్యన్ తెలంగాణ కుర్రాడు ఫిదెల్ ఆర్.స్నేహిత్ జోరుకు బ్రేకులు వేశాడు. సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకున్న స్నేహిత్ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్నేహిత్ 0-4 (11-13, 5-11, 9-11, 5-11)తో సత్యన్ చేతిలో ఓడాడు.
మరో సెమీస్‌లో శరత్ కమల్ 4-2 (11-8, 5-11, 14-12, 11-9, 9-11, 17-15) మానవ్ ఠక్కర్‌పై గెలిచాడు. ఇంతకుముందు 2014, 2015లో సత్యన్ ఫైనల్లో ఓడిపోయాడు.
ఇదీ చూడండి: స్నేహిత్ సంచలనం.. సీనియర్ టీటీలో పతకం ఖాయం