ఘనంగా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి హనుమంత సేవ

అనంతపురం జిల్లా కదిరిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి హనుమంత వాహన సేవ ఘనంగా సాగింది. ఈ సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి.. హనుమంత వాహన సేవ భక్తి శ్రద్ధలతో సాగింది. మద్వ నవమి సందర్భంగా స్వామి వారిని పుష్పాలతో అలంకరించి.. హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉందనగా.. ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని నిర్వాహకులు వెల్లడించారు.
ఇదీ చదవండి: అరిటాకంతా తమలాపాకంటా..!