అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ గిరీశ్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న ఈ పనులను ఆయన పరిశీలించారు.
స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను.. సకాలంలో పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీశ్ ఆదేశించారు. తుకివాకం సమీపంలో నిర్మాణంలో ఉన్న తడి, పొడి చెత్త నిర్వహణ కేంద్రం, సౌర విద్యుత్ ప్లాంట్ పనులు గడువులోపు పూర్తి చేయాలన్నారు. వినాయక సాగర్ నుంచి డీబీఆర్ ఆసుపత్రి వరకు చేపట్టిన 60 అడుగులు రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండీ.. శ్రీవారి సేవలో గాలి జనార్థన్ రెడ్డి