కారును ఢీ కొట్టిన తమిళనాడు ఆర్టీసీ బస్సు... ఒకరు మృతి

చిత్తూరు జిల్లా వేపగుంట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో.. ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు.. కారును ఢీ కొట్టటంతో ప్రమాదం జరిగింది.
చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం వేపగుంట క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి నుంచి తిరుపతికి వెళ్తున్న కారును.. తిరుపతి నుంచి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కారు డ్రైవర్ మృతదేహం.. కారులో చిక్కుకోవటంతో... అతి కష్టం మీద బయటకు తీశారు.
ఇదీ చదవండి: అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి