
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో సహకార రుణాలను భారీ మొత్తంలో బినామీలు దోచేశారు. ఈ ఘటనలో 10.73 కోట్లను స్వాహ చేసినట్లు అధికారులు తెలిపారు.
తొండంగి మండలంలో నకిలీ పేర్లు, రికార్డులతో.. భారీ సొమ్మును దోచేశారు బినామీలు. మండలానికి చెందిన 61 మంది పేర్లు మీద వారి వ్యక్తిగత రికార్డులు తారుమారు చేసి 2017-19లో కొందరు బినామీలు.. గండేపల్లి సొసైటీలో రుణాలు తీసుకున్నారు. అప్పు చెల్లించాలని.. సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపటంతో అసలు విషయం బయటపడింది. తమకు ఈ రుణాలకు సంబంధం లేదని వారు ఫిర్యాదు చేయటంతో అధికారులు విచారణ చేపట్టారు. పేర్లు, వారి వ్యక్తి గత రికార్డులు సరిపోలక పోవటంతో మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.
ఇదీ చదవండీ... మార్చి 10వ తేదీన సెలవు ప్రకటించండి.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశం