బరువు 900 గ్రాములు.. ధర రూ. 800.. !

మనమైతే ఓ...యాభై , వందో చివరికి రెండువందల గ్రాముల బరువున్న పీతలను చూసుంటాం. కానీ ఓ మత్స్యకారుడికి మాత్రం ఆ బరువు నాలుగురెట్ల బరువున్న పీత దొరికింది. నిజమేనోయ్..అంత పెద్ద పీత ఉంది. అది ఎక్కడ ఉందో తెలుసుకుంటారా..!
తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో ఓ మత్స్యకారుడికు భారీ పీత చిక్కింది. సాధారణంగా పీత ఓ మాదిరి పరిమాణం తక్కువ బరువుతో ఉంటాయి. కానీ ఈ పీత మాత్రం భారీ పరిమాణంతో పాటు సుమారు తొమ్మిది వందల గ్రాముల బరువుంది. దీనిని విక్రయించగా... ఓ మత్స్యకార మహిళ ఎనిమిది వందల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనిని మండ పీతగా పిలుస్తారని, మార్కెట్లో ఈ జాతికి చాలా గిరాకీ ఉందని మత్స్యకారులు తెలిపారు.
ఇదీ చూడండి. అరిటాకంతా తమలాపాకంటా..!