
పంచాయతీ ఎన్నికల్లో ప్రజల సమస్యలపై పోరాడే జన సైనికులు విజయం సాధించారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా జనసేన మద్దతుదారులు ఎదురొడ్డి మరీ గెలిచారని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్‌ను నాదెండ్ల మనోహర్ ఛైర్మన్ సందర్శించారు. జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పురపాలిక ఎన్నికల్లో భాజపా-జనసేన కలిసి పోటీపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈసీ