
తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న ఒడియా క్యాంపు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పదిహేను రోజుల ముందే ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు అక్కడి గిరిజనులు
తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న ఒడియా క్యాంపు గ్రామంలో 15 రోజుల ముందే శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదు దశాబ్దాల క్రితం ఒడిస్సా రాష్ట్రానికి చెందిన గిరిజనులు.. ఈ గ్రామానికి వలస వచ్చారు. మంగళవారం శివరాత్రి ఉత్సవాలు జరుపుకున్నారు. దీనిలో భాగంగానే గిరిజనులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు .
గ్రామ పెద్దల పర్యవేక్షణలో ఒరియా పూజారులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను గ్రామాల్లో మేళా తాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. ఆనంతరం గిరిజనులు ఆలయ ప్రాంగణంలో థింసా, తదితర నృత్యాలు చేశారు.
ఇదీ చూడండి. ఐదేళ్ల చిన్నారి రిషిత ప్రతిభ.. లింబో ఫైర్ స్కేటింగ్లో ప్రపంచ రికార్డు