
రూ.18 లక్షల విలువ చేసే గోవా మద్యం పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపర్ సబ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లాలో జరిపిన తనిఖీల్లో 135 మద్యం కేసులు, 3780 బాటిళ్లు స్వాధీనం చేసుకొని.. మినీ లారీ, కారు, బుల్లెట్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఏడుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామన్నారు.
గోవా రాష్ట్రం నుంచి వినుకొండకు తరలిస్తున్న అక్రమ మద్యం లారీని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. గుంటూరు జిల్లా రూరల్ అడిషనల్ ఎస్పీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం నుంచి వినుకొండవైపుకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
గోవా మద్యం మినీ లారీలో తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. మినీ లారీ పైభాగంలో మిషనరీ త్రాగు నీరు బాటిల్ నింపి.. క్రింది భాగంలో మద్యం తరలిస్తున్నట్లు వివరించారు. ఈ తనిఖీల్లో పలు బ్రాండ్లకు చెందిన 135 మద్యం కేసులు, 3780 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వాటి విలువ రూ.18 లక్షలు ఉంటుందన్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని లారీ, బుల్లెట్, కారు వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
శావల్యాపురం మండలం పిచికలపాలెం గ్రామానికి చెందిన బోడేపూడి నాగేశ్వరావు అనే వ్యక్తి ఈ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గోవా నుంచి మద్యం కొనుగోలు చేసి ఆంధ్రలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అయితే ప్రధాన నిర్వాహకుడు బోడేపూడి నాగేశ్వరరావు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...