
గుంటూరు జిల్లా రేపల్లెలో పుర పోరుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడడానికి నేతులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
రేపల్లె పట్టణం పుర పోరు ప్రచారాలతో సందడిగా మారింది. ప్రధాన పార్టీలు తమతమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి శ్రమిస్తున్నారు. పట్టణంలో మొత్తం 28 వార్డులు ఉండగా... 36,806 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 17,431, మహిళలు 19,356 , ఇతరులు 19 ఉన్నారు. వీరిలో ఓసీ, బీసీలు కలిపి 29 వేలకు పైగా ఉండగా... 7,500 వరకు ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సమరంలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే వార్డుల్లో సమస్యలు పరిష్కారిస్తామంటూ.. హామీలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండీ... పుర ఎన్నికల కోసం.. ముందస్తు తనిఖీలు