పుర ఎన్నికల కోసం.. ముందస్తు తనిఖీలు

గుంటూరు ఆరండల్ పేటలోని హోటళ్లు, లాడ్జిల్లో పోలీసులు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోదాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో గుంటూరు ఆరండల్పేటలోని హోటళ్లు, లాడ్జిల్లో పోలీసులు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ నరేశ్ కుమార్ ఆధ్వర్యంలో.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను ఆరా తీశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ, అసాంఘిక ఘటనలు జరగకుండా ముందస్తూ.. సోదాలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండీ.. చెట్టును ఢీకొన్న ట్రాలీ ఆటో.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు