
మాములుగా తమలపాకు అరచేతిలో పట్టేంతది అయితే మనం చూసుంటాం. కానీ అరిటాకంతా తమలపాకును మీరు చూసారా..! చూడలేదా..ఇప్పుడు చూసేయండి.
సాధారణంగా అరిటాకులో భోజనం చేసి.. తమలాపాకుతో కిళ్లీ వేసుకుంటాం. కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో రైవస్ కాలువ కట్టపై నివాసముంటున్న కోడారి రామచంద్రరావు ఇంటి వద్ద పెరిగిన తమలపాకులను మాత్రం విస్తరిలా వేసుకుని భోజనం చేసేయవచ్చు. 28 సెంటీమీటర్లు ఎదిగిన ఈ ఆకులను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పతి బంగ్లా రకం తమలపాకులు సాధారణంగా ఎనిమిది సెంటీమీటర్ల మేర ఎదుగుతాయన్నారు. పోషకాలు ఎక్కువగా అందడం వల్ల ఇలా అసాధారణంగా పెరుగుతాయని కంకిపాడు ఉద్యానవనశాఖ అధికారి లక్పతి తెలిపారు.
ఇదీ చూడండి.
కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం