మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. గరిటె తిప్పిన దేవినేని అవినాష్!
municipal

మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం కావటంతో... నాయకులు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విజయవాడలో ప్రచారన్ని ప్రారంభించిన.. వైకాపా నేత దేవినేని అవినాష్, ఓ టిఫిన్ సెంటర్​లో గరిటె తిప్పారు.

విజయవాడ నగర పాలక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని.. తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఉద్ధృతం చేసింది. తూర్పు నియోజకవర్గం శాసనసభకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో.. ఆ 21 డివిజన్​లలో ఎన్నికలను వైకాపా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జి దేవినేని అవినాష్ ప్రచారాన్ని ప్రారంభించి.. అభ్యర్థితో పాటు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా కృష్ణలంక రాణీగారి తోటలోని 17వ డివిజన్​లో కరపత్రాలు ఇస్తూ.. ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఓ టిఫిన్​ సెంటర్​ వద్ద గరిటె పట్టుకున్నారు.

వైకాపా నేతల మున్సిపల్ ఎన్నికల ప్రచారం

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం: డీజీపీ

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.