
బావమరిది బావ బతుకు కోరుతారంటారు. కానీ.. ఈ బావమరిది బావను బలి తీసుకున్నాడు. ఆస్తి తగదాలతో బావను బావమరిది కిరాతకంగా హతమార్చిన ఘటన కర్నూలు జిల్లా శరీన్ నగర్లో సంచలనం సృష్టించింది.
కర్నూలు జిల్లా శరీన్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో బావను బావమరిది కిరాతకంగా హత్య చేశాడు. శరీన్ నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఇంట్లో ఉన్న సమయంలో బావమరిది రాజు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. అడ్డొచ్చిన వెంకటేశ్వర్లు భార్య పుష్పలతపై కూడా దాడికి తెగబడ్డాడు. ఇటీవల పొలం అమ్మగా వచ్చిన డబ్బులో రూ. 3 లక్షలు ఇవ్వలేదనే కొపంతోనే వెంకటేశ్వర్లును హత్య చేసినట్లు మృతి భార్య తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి
ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ... యువతి ఆత్మహత్య.. ప్రియుడేమో!