రమణీయం.. నీలకంఠుడి రథోత్సవం

కర్నూలు జిల్లాలో నీలకంఠేశ్వర స్వామి రథోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహోత్సవాల్లో భాగంగా మహా రథోత్సవం వైభవంగా జరిగింది.
కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి గ్రామంలో, హొళగుంద మండల కేంద్రంలో నీలకంఠేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా మహా రథోత్సవం వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామి వైభవాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ‘నీలకంఠా నమో నమో.. శంభో శివ శంభో’ అనే నినాదాల మధ్య రథం లాగారు.