వైభవంగా శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామివారి కల్యాణం

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయార్చకులు తెలిపారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామివార్ల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తమ ఇలవేల్పుకు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కల్యాణోత్సవం జరిపిస్తారు. సాయంత్రం స్వామివార్లకు రథోత్సవం నిర్వహిస్తారు.
హోసూరులో శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వర స్వామివార్ల కల్యాణం
ఇదీ చదవండి: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో శ్రీవారి కల్యాళాలు : తితిదే