
ఆటో చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురంలో జరిగింది. బాధితులంతా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన వారిగా గుర్తించారు.
గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురం వద్ద ట్రాలీ ఆటో చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ తో పాటు.. వీరయ్య, ఏడేళ్ల బాలుడు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 30 మంది కూలీలు ఉన్నారు. బాధితులంతా.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన వారిగా గుర్తించారు.
గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వినుకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలుగుదేశం నేత జీవీ ఆంజనేయులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రమాదంలో మరణించిన భీమయ్య పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి.. బతుకుదెరువు కోసం మళ్లీ బయల్దేరాడని కుటుంబసభ్యలు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: విద్యుత్ తీగలు తెగిపడి తల్లీకుమారుడు సజీవదహనం