తెదేపా నాయకులపై వైకాపా కార్యకర్తల దాడి

కర్నూలు జిల్లా ఆదోని మండలం బసపురం గ్రామంలో 12వ వార్డుకు పోటీ చేసిన నర్సప్ప ద్విచక్రవాహనంపై వెళ్తున్నప్పుడు రహదారిపై ఉన్న బురద వైకాపా నాయకుడిపై పడిందన్నారు. దీంతో తెదేపా వర్గీలయులపై వైకాపా దాడి చేశారన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం బసపురంలో తెలుగుదేశం నాయకులపై.. వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి, లింగప్ప, కేశవ్ అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. తెలుగుదేశం మద్దతుతో వార్డు మెంబర్‌గా పోటీ చేసిన నర్సప్ప అనే వ్యక్తి బైక్ వెళ్తున్నప్పుడు.. రోడ్డుపైనున్న బురద నీరు వైకాపా నాయకుడిపై పడిందన్న కారణంతో దాడి చేశారని బాధితులు తెలిపారు.
తెదేపా నాయకులపై వైకాపా కార్యకర్తల దాడి
ఇదీ చదవండి: నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ