కూలిన వంతెన.. రాకపోకలకు అంతరాయం

నెల్లూరు జిల్లాలోని మినగల్లులో పురాతన వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో వంతెన కూలిపోయింది. పురాతన వంతెన కావడం.. అందులోనూ అధిక లోడ్లతో గ్రావెల్, ఇసుక వాహనాలు వెళ్తుండడంతో వంతెన కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని.. బ్రిడ్జిని త్వరగా నిర్మించాలని గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ... యువతి ఆత్మహత్య.. ప్రియుడేమో!