అఖీంఖాన్పేట గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని ధర్నా

'పంచాయతీ ముద్దు.. కార్పొరేషన్ వద్దు..' అంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అఖీంఖాన్ పేట గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. అఖీంఖాన్ పేటను పంచాయతీగానే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు.
'పంచాయతీ ముద్దు.. కార్పొరేషన్ వద్దంటూ..' శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ధ అఖీంఖాన్ పేట గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. తోటపాలెం పంచాయతీకి చెందిన అఖీంఖాన్ పేటను ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని వీరంతా డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరపాలకసంస్థలోకి అఖీంఖాన్ పేట గ్రామాన్ని విలీనం చేయవద్దని అభ్యర్థించారు. అఖీంఖాన్ పేట గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా గుర్తించాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ