
శ్రీకాకుళం జిల్లా కమ్మసిగడంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర ఘనంగా ప్రారంభమయ్యాయి. మెుక్కులు చెల్లించుకునేందుకు ఆలయం వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పిలిచే.. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తల్లి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరను రణస్థలం మండలం కమ్మ సిగడం గ్రామంలో మూడురోజుల పాటు నిర్వహించనున్నారు. మెుదటగా అమ్మవారికి బంటుపల్లి గ్రామస్తులు తాళిబొట్టు, పసుపు కుంకుమలు సమర్పించారు. పల్లకిలో తాళిబొట్టును ఊరేగింపుగా తీసుకొచ్చి.. అమ్మవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా మూడు రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
రణస్థలం మండలం పరిధిలో ఉన్న 15 గ్రామాల ప్రజలు.. ఈ జాతరను ఘనంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. జాతర సందర్భంగా మెుక్కులు చెల్లించుకునేందుకు ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు.
ఇదీ చదవండి: పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. లాఠీఛార్జ్‌తో అదుపు చేసిన పోలీసులు