
విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో కమిషనర్ నాగలక్ష్మి ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నోడల్ అధికారులు, జోనల్ కమిషనర్లు, ఎలక్షన్ సెల్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై సూచనలు చేశారు. నోడల్ అధికారులు మార్చి నెలలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలన్నారు.
విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో కమిషనర్ నాగలక్ష్మి ఎన్నికల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పురపాలక, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ సవాంగ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యద్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇతర సీనియర్ అధికారులతో ఆయన విజయవాడ నుంచి వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులను అభినందించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వి.వినయ్‌చంద్, నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, జీవీఎంసీ నాగలక్ష్మి, ఎస్సీ కృష్ణారావు, ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ