
మార్చి 2 నుంచి 4 వరకు మారిటైమ్ ఇండియా సమ్మిట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా, అంతర్జాతీయ స్థాయిలో దేశంలో ఉన్న అవకాశాలకు విస్తృతంగా తెలియజెప్పడం సదస్సు ఉద్దేశం.
భారత నౌకా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మార్చి రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు మారిటైమ్ ఇండియా సమ్మిట్ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సు జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా, అంతర్జాతీయ స్థాయిలో దేశంలో ఉన్న అవకాశాలకు విస్తృతంగా తెలియజెప్పడం సదస్సు ముఖ్య ఉద్దేశమని విశాఖ పోర్టు ఛైర్మన్ కె. రామ్మోహనరావు వెల్లడించారు.
పోర్టు మౌలిక వసతుల అభివృద్ధి, నౌకా నిర్మాణం, రీసైక్లింగ్, మరమ్మతులు, అంతర్గత కనెక్టివిటీ, బహురకాల లాజిస్టిక్స్, తీరప్రాంత రవాణా, అంతర్గత నీటి రవాణా, బల్క్ కార్గో రవాణ, పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, సముద్ర(మారిటైమ్) వాణిజ్యం వంటి వివిధ విభాగాల వారీగా సమావేశాలు నిర్వహిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలపై ప్రత్యేక సమావేశం మూడో తేదీన మధ్యాహ్నం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రత్యేక సెషన్లో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ది కోసం, మారీటైమ్ సంబంధిత అవకాశాలు, వివిధ పెట్టుబడుల అవకాశాలను ఈ ప్రత్యేక సమావేశంలో డిజిటల్ పెవిలియన్ ద్వారా ప్రదర్శించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాల నుంచి 20 వేలకు పైగా డెలిగేట్స్ ఈ సమ్మిట్లో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: ఏ మహమ్మారికైనా హైదరాబాద్ నుంచే టీకా రావాలి'