మోపెడ్‌ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి

టీవీఎస్ మోపెడ్‌ను కారు ఢీకొట్టిన ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో మాదాల అర్జున్ అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నం శివారు సింగరాజుపేట వద్ద టీవీఎస్ మోపెడ్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గొలుగొండ మండలం ఏది గైరంపేట గ్రామానికి చెందిన మాదాల అర్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. మోపెడ్‌పై అర్జున్ సమీపంలోని గ్రామానికి వెళుతుండగా.. చింతపల్లి నుంచి నర్సీపట్నం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి