
కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచి ఎన్నికపై చెలరేగిన వివాదం.. ఆందోళనకు దారితీసింది. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి.. ఫలితాలు తారుమారు చేశారని తెదేపా మద్దతుదారులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
విజయనగరం జిల్లా కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచి ఎన్నికపై వివాదం కొనసాగుతూనే ఉంది. సర్పంచిగా వైకాపా బలపరిచిన అభ్యర్థి 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించడంపై తెదేపా మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి తాము 258 ఓట్ల ఆధిక్యంలో ఉన్నామని.. ఈ క్రమంలో వైకాపా బలపరిచిన అభ్యర్థిని విజేతగా ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి.. ఫలితాలు తారుమారు చేశారని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తిరిగి రీ కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేసిన తెదేపా మద్దతుదారులు.. న్యాయం జరిగే వరకు ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...