
ఉపసర్పంచ్.. తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ.. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం సచివాలయం సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. సచివాలయ కార్యదర్శిపై దాడికి ప్రయత్నం జరిగిందన్న ఉద్యోగులు.. తమకు రక్షణ కల్పించాలని కోరారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ సచివాలయ సిబ్బంది ఆందళనకు దిగారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఉపసర్పంచ్.. తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ.. విధులు బహిష్కరించారు. గతంలో లేని విధంగా ఇప్పుడు గ్రామ సచివాలయంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కుర్చీలు వేశారని.. తాము ఎవరి కింద పనిచేయాలో స్పష్టత ఇవ్వాని కోరారు. సచివాలయ కార్యదర్శిపైనే ఉపసర్పంచ్ దాడిచేశారని, తమకు రక్షణ కల్పించాలని ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి...