ఐటీడీఏ కార్యాలయం ఎదుట కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ నిరసన

పార్వతీపురంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ నిరసన చేపట్టారు. 2018 ఏప్రిల్ నుంచి 2019 నవంబర్ వరకు ఇవ్వాల్సిన పాత జీతం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ నిరసన చేపట్టారు. 2018 ఏప్రిల్ నుంచి 2019 నవంబర్ వరకు పాత జీతం చెల్లించాలని.. 2020 సెప్టెంబర్ నుంచి నేటి వరకు ఉన్న కొత్త జీతం బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు లేఖను అందజేశారు.
ఇదీ చదవండి: