
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రమణ కుమారి విజ్ఞప్తి చేశారు. ప్రజలు కొవిడ్ వ్యాక్సినేషన్ పై అపోహలు వీడి వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావాలని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె కోరారు.
కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి, వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తగా ఉండేందుకు టీకా వేయించుకోవడం చాలా అవసరమని విజయనగరం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి రమణ కుమారి తెలియజేశారు. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెడుతున్నట్లు ఆమె వెల్లడించారు. తదుపరి 50 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, తరువాత సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ మొదలుపెడతామన్నారు. అంతవరకు ప్రజలు మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ ఉపయోగిస్తూ, భౌతిక దూరం పాటించాలని కోరారు. ప్రజలు వ్యాక్సినేషన్ నమోదు చేయించుకునే సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి...: చీపురుపల్లిలో ఫైర్ సర్వీస్ పెట్రోల్ బంక్ ప్రారంభం