7 నెలల చిన్నారిని బయటకు విసిరేసిన తండ్రి... చికిత్స పొందుతూ బాలుడు మృతి

10:24 February 23
చిన్నారిని బయటకు విసిరేసిన తండ్రి... మద్యం మత్తులో ఘాతుకం..
కడప జిల్లా కొత్తకోడూరులో మద్యానికి బానిసైన తండ్రి చేతిలో.. ఏడు నెలల చిన్నారి మృతి చెందాడు. కొత్తకోడూరుకు చెందిన అల్లం వెంకటరమణ, శేషమ్మ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటో నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటరమణ మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యాభార్తలకు తరచూ గొడవ జరుతుంది. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి వెంకరమణ, శేషమ్మ గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ ఏడు నెలల చిన్నారి శివను... బయటకు విసిరివేయటంతో.. తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడు వెంకరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: విద్యుత్ తీగలు తెగిపడి తల్లీకుమారుడు సజీవదహనం