118 యుద్ధ ట్యాంకుల కొనుగోలుకు కేంద్రం సిద్ధం
Defence

118 అర్జున్‌ మార్క్‌-1ఏ యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేసేందుకు రక్షణశాఖ సిద్ధమైంది. రూ.6వేల కోట్లతో ఈ ట్యాంకులను కొనుగోలు చేయనుంది. కొద్ది రోజుల క్రితమే అర్జున్‌ మార్క్‌-1A యుద్ధ ట్యాంకును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

118 అర్జున్ మార్క్​-1ఏ యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది రక్షణ శాఖ. ఇందుకోసం రూ.6వేల కోట్లను కేటాయించనుంది. అర్జున్​ మార్క్​-1ఏ యుద్ధ ట్యాంకును భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇచ్చిన కొద్ది రోజులకే రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. త్రివిద దళాధిపతి బిపిన్‌ రావత్, ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పాల్గొనే డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకోనుందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ యుద్ధ ట్యాంకులను భారత రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే 124 అర్జున్‌ యుద్ధ ట్యాంకులు భారత ఆర్మీలో చేరి పాకిస్థాన్‌ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాయి. ఇదే తరహాలోనే అర్జున్‌ మార్క్‌-1A యుద్ధ ట్యాంకులు సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తాయని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

భారత ఆర్మీలో స్వదేశీ ఆయుధ సంపత్తిని పెంచేందుకు త్రివిధ దళాధిపతి బిపిన్​ రావత్​, డీఆర్​డీఓ చీఫ్ డా. జీ. సతీశ్ రెడ్డి ఈ ప్రాజెక్ట్​ను వేగవంతం చేశారు.

ఇదీ చదవండి : '500 మీటర్ల దూరంలో భారత్, చైనా సైన్యాలు'

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.