
టూల్కిట్ కేసులో అరెస్టయిన దిశ రవి.. తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె.. ఇవాళ దిల్లీ పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అన్నదాతల ఆందోళనలకు సంబంధించిన 'టూల్కిట్' వ్యవహారంలో అరెస్టయిన పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి.. తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన ఆధారాలు నమ్మశక్యంగా లేవన్న దిల్లీ కోర్టు.. దిశ రవికి అంతకుముందు బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో.. మంగళవారం రాత్రి సమయంలో ఆమె బయటకి వచ్చారు.
జనవరి 26న రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి సంబంధించి ఓ కార్యాచరణను ఈ టూల్కిట్లో పొందుపర్చారనే ఆరోపణలతో దిశ రవిని ఫిబ్రవరి 13 న పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు
ఇదీ చదవండి: