కర్ణాటకలో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆందోళన
Breaking

పాఠశాల ఫీజుల్లో 30 శాతం కోత విధించాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాలు మంగళవారం భారీగా నిరసనలు చేపట్టాయి. ఇంత మొత్తం కోత విధిస్తే ఉపాధ్యాయులకు జీతాలిచ్చేదెలా అని ప్రశ్నిస్తున్నాయి.

కర్ణాటకలోని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు బెంగుళూరులో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఫీజుల్లో 30 శాతం కోత విధించాలని కోరుతూ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు జనవరి 29న ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఈ చర్యను నిరసిస్తూ బెంగుళూరు రైల్వే స్టేషన్​ నుంచి ఫ్రీడమ్​ పార్కు వరకు ఆందోళన చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు ఇటీవలే పిలుపునిచ్చాయి.

Karnataka private school teachers Stages protest in Bengaluru
భారీ ఎత్తున నిరసన చేపట్టిన ఉపాధ్యాయులు

ఈ విద్యాసంవత్సరం మొత్తం 70 శాతమే ఫీజు వసూలు చేస్తే ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఎలా ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. మంగళవారం చేపట్టిన ఈ నిరసనలో దాదాపు 25,000కు పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Karnataka private school teachers Stages protest in Bengaluru
నిరసనలో పాల్గొన్న మహిళా ఉపాధ్యాయులు
Karnataka private school teachers Stages protest in Bengaluru
ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన

అయితే... ప్రైవేట్​ యాజమాన్యాల ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవొద్దని ప్రైవేటు స్కూల్​ పేరెంట్స్ అసోసియేషన్లు కోరుతున్నాయి.

Karnataka private school teachers Stages protest in Bengaluru
25 వేల మందికి పైగా నిరసనలో పాల్గొని

ఇదీ చదవండి:అసోంలో 1,050 మంది మిలిటెంట్ల లొంగుబాటు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.