
రెండేళ్ల క్రితం బాలికను అపహరించి, అత్యాచారం చేసిన కేసులో రాజస్థాన్లోని పోక్సో కోర్టు దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ.30,000 జరిమానా వేసింది.
13 ఏళ్ల బాలికను అపహరించి, అత్యాచారం చేసిన కేసులో దోషికి రాజస్థాన్లోని పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ.30,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
కేసు వివరాలు..
రాజస్థాన్లోని కోటా నగరంలో 2019 మార్చి 27న పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా 13 ఏళ్ల బాలికను.. మోను మనోవార్ అనే 23 ఏళ్ల యువకుడు అపహరించాడు. తన బంధువుల ఇంట్లో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. పాఠశాల నుంచి తిరిగి రాలేదని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. 19 రోజలు తర్వాత ఆ అమ్మాయిని కాపాడిన పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత తీర్పు వెలువరించిన పోక్సో కోర్టు..మోను మనోవార్ను సోమవారం దోషిగా తేల్చిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
ఇదీ చదవండి:టూల్కిట్ కేసులో దిశ రవికి బెయిల్